Daniel Vettori : ఐపీఎల్ 18వ సీజన్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన సన్‌రైజర్స హైదరాబాద్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రికార్డు స్కోర్‌తో అలరించింది. హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) వీరోచిత సెంచరీతో చెలరేగగా.. నిరుడు ఫైనల్లో తమను ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన కమిన్స్ సేన డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఘోర పరాభవాన్ని కట్టబెట్టింది. అయితే.. యువ స్పిన్నర్ హర్ష్ దూబే (Harsh Dubey) సంచలన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హ్యాట్రిక్ మిస్ అయిన ఈ కుర్రాడిపై హెడ్ కోచ్ డానియల్ వెటోరీ (Daniel Vettori) ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో హర్ష్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చినప్పటికీ ఈ కుర్రాడు తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. అతడి ప్రదర్శన పట్ల టీమ్ మేనేజ్మెంట్ అంతా సంతోషంగా ఉంది. దూబే చాలా తెలివైన బౌలర్. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకుంటాడు. అంతుకు తగ్గట్టుగా తన బౌలింగ్‌ను మార్చుకుంటాడు. కానీ, మారోజుల్లో మేము అతడిలా చేయలేకపోయాం. గత మూడు మ్యాచుల్లో దూబే తన బౌలింగ్‌తో అందరి మెప్పు పొందాడు.
🔙 to 🔙 wickets ☝️
Harsh Dubey making his presence felt 🧡
Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR pic.twitter.com/u4SFM0mM54
— IndianPremierLeague (@IPL) May 25, 2025
వచ్చే ఐపీఎల్ సీజన్ కల్లా అతడు మరింత రాటుదేలుతాడు. భారత ఏ జట్టు, దేశవాళీ క్రికెట్.. రూపంలో ఈ లెగ్ స్పిన్నర్‌కు అపారమైన అవకాశాలున్నాయి. సో.. హర్ష్ బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ మెరుగవుతాడని ఆశిస్తున్నా. అదే జరిగితే ఆరెంజ్ ఆర్మీకి అద్భుతమైన ఆల్‌రౌండర్ దొరికినట్టే’ అని కోల్‌కతాపై విజయం అనంతరం వెటోరీ వాఖ్యానించాడు. కోల్‌కతాపైనే కాకుండా ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ దూబే తెలివిగా విరాట్ కోహ్లీ (Virat Kohli)ని బోల్తా కొట్టించాడు. అతడిని బ్యాక్వర్డ్ దిశగా ఆడేలా చేసి వికెట్ సాధించి.. హైదరాబాద్‌కు బిగ్ వికెట్ అందించాడు.
A 𝙃𝙖𝙧𝙨𝙝 moment for #RCB!
Young Harsh Dubey strikes right after the powerplay to dismiss well-set Virat Kohli! 🧡
RCB need 136 runs in 72 deliveries.
Updates ▶ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/f2qkt18t0F
— IndianPremierLeague (@IPL) May 23, 2025
ఆదివారం ఢిల్లీ మైదానంలో తన స్పిన్ మ్యాజిక్‌తో మూడు వికెట్లు తీసిన హర్ష్.. సన్‌రైజర్స్ భారీ విజయంలో భాగమయ్యాడు. తొలుత ట్రావిస్ హెడ్(76) హిట్టింగ్‌కు డీలా పడిన కోల్‌కతా బౌలర్లను హెన్రిచ్ క్లాసెన్(105 నాటౌట్) చితక్కొడుతూ అజేయ సెంచరీ బాదాడు. దాంతో, ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోర్ నమోదు చేసింది కమిన్స్ సేన. 279 పరుగుల ఛేదనలో కోల్‌కతా ఆది నుంచి తడబడింది. టాపార్డర్‌ను జయదేవ్ ఉనాద్కాట్ కూల్చగా.. మిడిల్ ఓవర్లలో హర్ష్ దూబే తిప్పేశాడు.
Fast. Faster. Klaasen ⚡
Storming into a Hein-𝙧𝙞𝙘𝙝 list of superstars 😎#TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/6Tkm9FBfDl
— IndianPremierLeague (@IPL) May 25, 2025
వరుస బంతుల్లో రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అనంతరం.. రమన్‌దీప్ సింగ్‌ను వెనక్కి పంపి కోల్‌కతాను ఓటమి అంచుల్లోకి నెట్టాడు దూబీ. వైభవ్ అరోరా రనౌట్ కావడంతో సన్‌రైజర్స్ 110 రన్స్ తేడాతో గెలుపొంది.. లీగ్‌ను విజయంతో ముగించింది.