Rafael Nadal : టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్(Rafael Nadal) మళ్లీ అభిమానులను పలకరించనున్నాడు. అయితే.. ఈసారి మైదానంలో కాదు ప్రచారకర్తగా ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నాడు. ఈ దిగ్గజ ఆటగాడు తాజాగా ప్రముఖ ఇన్ఫోసిస్(Infosys) డిజిటల్ గ్లోబల్ అంబాసిడర్(Global Brand Ambassador)గా నియమితులయ్యాడు. ఈ స్పెయిన్ బుల్ మూడేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగనున్నాడు. విశేషం ఏంటంటే..? డిజిటల్ సేవలు అందించే కంపెనీతో నాదల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి.
ఇన్ఫోసిస్ ప్రచారకర్తగా నియామకంపై రఫా ఆనందం వ్యక్తం చేశాడు. ‘అందరికీ నమస్కారం. గ్లోబల్ అంబాసిడర్‌గా ఇన్ఫోసిస్ కంపెనీలో చేరేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులకు ఈ కంపెనీ డిజిటల్ అనుభవాన్ని అందించింది. అందుకని ఈ ప్రయాణం ఎంతో అందంగా సాగుతుందని నేను నమ్ముతున్నా’ అని నాదల్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.
Hello everyone. Very excited to join Team @Infosys as their global brand ambassador. Infosys has brought its digital expertise to the global tennis ecosystem and love impact that Infosys is making to communities beyond the court. I am looking forward to this partnership to do… pic.twitter.com/vf8wcV5ixp
— Rafa Nadal (@RafaelNadal) August 24, 2023
ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) సాయంతో రూపొందించిన ప్రోగ్రాంలో నాదల్ మ్యాచ్ విశ్లేషకుడిగా కనిపించన్నాడు. ఈ టెన్నిస్ స్టార్ డిజిటల్ అవతార్‌గా లైవ్ మ్యాచ్‌లతో పాటు పాత మ్యాచ్‌ల విశేషాలను అభిమానులతో పంచుకోనున్నాడు. ఒకరకంగా స్పోర్ట్స్ టెక్నాలజీలో ఇదొక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు.
క్లే కోర్టు కింగ్‌గా పేరొందిన నాదల్ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్‌తో రికార్డు సృష్టించాడు. అయితే.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఒకానొక సమయంలో రోజర్ ఫెదరర్(Roger Federer)కు గట్టి పోటీదారుగా వెలుగు వెలిగిన నాదల్ తొడ కండరాల గాయం కారణంగా రాకెట్ ముట్టడం లేదు.
నాదల్, నొవాక్ జకోవిచ్
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్లో ఓడిన రఫా మళ్లీ కోర్టులోకి దిగలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న అతడి రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ స్టార్ ఆటగాడు మళ్లీ రాకెట్ పడితే జకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డు గల్లంతవ్వడం ఖాయం.