Magnus Carlsen | ఫిడే వరల్డ్ కప్ చాంపియన్ కార్ల్సన్.. ఓడినా అందరి మనసులు గెలుచుకున్న ప్రజ్ఞానంద
Magnus Carlsen : వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్(Magnus Carlsen) ఫిడే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అతడు భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద(R Praggnanandhaa)పై గెలుపొందాడు. టై బ్రేక్‌లో కార్ల్సన్ విజయం సాధించి కెరీర్లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అసమాన పోరాటంతో ఆకట్టుకున్న
Magnus Carlsen : వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్(Magnus Carlsen) ఫిడే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అతడు భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద(R Praggnanandhaa)పై గెలుపొందాడు. టై బ్రేక్‌లో చివరకు కార్ల్సన్ విజయం సాధించి కెరీర్లో మొదటి ఫిడే వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అసమాన పోరాటంతో ఆకట్టుకున్న 18 ఏళ్ల ప్రజ్ఞానంద రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.
తన అద్భుత గేమింగ్‌తో వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్(Candidates Tournament 2024)కు అర్హత సాధించాడు. ఇటలీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరున(Fabiano Caruana) మూడో స్థానంలో నిలిచాడు. ఇతను కూడా క్యాండిడేట్స్ పోటీలకు క్వాలిఫై అయ్యాడు.
What a World Cup for Pragg! 👏🇮🇳
An incredible story and a brilliant talent, @rpragchess took down two of world’s top three, and secured his place in the 2024 Candidates Tournament! 🥈 pic.twitter.com/KpnFHcS9Sx
— Chess.com (@chesscom) August 24, 2023
సుమారు మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో కార్ల్సన్, ప్రజ్ఞానంద.. ఇద్దరూ పోటీపోటీగా తలపడ్డారు. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో విజేతను నిర్ణయించే టై బ్రేక్ కీలకం అయింది. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద వరల్డ్ నంబర్ 1కు చెమటలు పట్టించాడు.
Congratulations to @MagnusCarlsen on winning his 1st ever #FIDEWorldCup🏆! @rpragchess played a brilliant event and will be back: https://t.co/0FMmdfXEOq #c24live pic.twitter.com/u6V6V2ZPwd
— chess24.com (@chess24com) August 24, 2023
ఏమాత్రం బెరుకు లేకుండా ఆడిన అతను కార్ల్‌సన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే.. ర్యాపిడ్ చెస్‌లో దూకుడు కనబర్చలేక మ్యాచ్‌తో పాటు ట్రోఫీ చేజార్చుకున్నాడు. గతంలో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద ఈసారి మాత్రం అదే ఫలితం సాధించలేకపోయాడు. దాంతో, చరిత్రకు ఒక్క అడుగు దూరంలో నిలిచినా అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Sourav Ganguly | వరల్డ్ కప్ కమిటీలో గంగూలీ.. ప్రధాన స్టేడియంపై నిఘా పెట్టనున్న దాదా
Prasidh Krishna | బుమ్రా నుంచి చాలా నేర్చుకున్నా.. ఆ విషయంలో అతడు ఎంతో బెటర్ : ప్రసిధ్ కృష్ణ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

