Rachin Ravindra | డబుల్ సెంచరీ బాదిన వరల్డ్ కప్ హీరో.. రెండో కివీ బ్యాటర్‌గా రికార్డు
Rachin Ravindra : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్...
Rachin Ravindra : న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2003)లో రెండు సెంచరీతో చెలరేగిన ఈ యంగ్‌స్టర్ తాజాగా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రవీంద్ర ద్విశతకం బాదాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీనే ద్విశతకంగా మలిచిన రెండో కివీస్ బ్యాటర్‌గా రవీంద్ర రికార్డు నెలకొల్పాడు. రవీంద్ర కంటే ముందు డెవాన్ కాన్వే(Devan Conway) ఈ ఫీట్ సాధించాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కాన్వే 200 రన్స్ కొట్టాడు.
New Zealand’s new highest maiden Test hundred! Follow play LIVE in NZ with TVNZ DUKE, TVNZ+, SENZ Radio and The ACC. LIVE scoring | https://t.co/paIW7ZKpZy #NZvSA pic.twitter.com/5TxnuOvdpl
— BLACKCAPS (@BLACKCAPS) February 5, 2024
టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 43 మంది మాత్రమే ఈ ఫీట్ సాధించారు. వీళ్లలో భారత క్రికెటర్లు ఇద్దరు ఉండడం విశేషం. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన చెన్నై టెస్టులో కరుణ్ నాయర్(Karun Nair) తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలవగా.. వినోద్ కాంబ్లీ 224 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కరుణ్ నాయర్(303 నాటౌట్)

బే ఓవల్ స్టేడియంలో సఫారీలతో జరుగుతున్న తొలి టెస్టులో రచిన్ రవీంద్ర ( 240 : 366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర విహారం చేశాడు. డబుల్ సెంచరీ తర్వాత ధాటిగా ఆడిన 240 పరుగుల వద్ద నీల్ బ్రాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (118 : 259 బంతుల్లో16 ఫోర్లు) 30వ టెస్టు సెంచరీ బాదగా.. మిగతావాళ్లు విఫలమయ్యారు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌటయ్యింది.
ఇవి కూడా చదవండి
- Dead body | యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
- Ravichandran Ashwin | ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు.. దిగ్గజాలను అధిగమించిన అశ్విన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

