R Pragghnanadhadha : హంగేరిలో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత బృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 21 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ పసిడి కొల్లగొట్టిన అబ్బాయిల, అమ్మాయిల జట్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశానికెత్తేశారు. చదరంగంలో మన ఆధిపత్యాన్ని మరోసారి చాటారంటూ వాళ్లను ప్రధాని పొగిడారు. ఈ సందర్భంగా యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద(R Pragghnandhadha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫలానా ఆట గొప్పది అంటూ ఏది ఉండదని ప్రజ్ఞానంద అన్నాడు. అంతేకాదు తన దృష్టిలో క్రికెట్ కూడా కష్టమైనదేనని ఈ కుర్ర గ్రాండ్‌మాస్టర్ తెలిపాడు. ‘మేము చరిత్రలో నిలిచిపోయేంతటి విజయం సాధించాం. ఏకంగా రెండు స్వర్ణ పతకాలు సాధించాం. ఇక చెస్ అనే కాదు క్రికెట్ కూడా చాలా కష్టమైన ఆటే. నా దృష్టిలో ఆటలను ఒకదానితో మరొకదాన్ని పోల్చడం మంచిది కాదు.
#WATCH | Delhi: On winning gold medal in the 45th Chess Olympiad, Indian chess grandmaster R Praggnanandhaa says, ” We have done something very historic, we won 2 gold medals…cricket is also very tough field…I don’t think we should compare between sports, every sport is very… pic.twitter.com/RVdoLmJiAz
— ANI (@ANI) September 25, 2024
ఎందుకంటే.. ప్రతి ఆట కష్టమైనదే’ అని ప్రజ్ఞానంద వెల్లడించాడు. 64 గడుల చదరంగం ఆటలో భారత యువకెరటాలు అద్భుతం చేశారు. హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
India takes it all 🇮🇳❤️ 2024 Chess Olympiad #chess #ChessOlympiad2024 pic.twitter.com/7Hk2PMdIkO
— Keti Tsatsalashvili (@keti_chess) September 24, 2024
మొదట అర్జున్ ఇరిగేసి, డి.గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, హరికృష్ణ, శ్రీనాథ్ నారయణ్లతో కూడిన అబ్బాయిలు బృందం స్లోవేనియాకు చెక్ పెట్టి స్వర్ణం సాధించింది. వీళ్లు చరిత్ర సృష్టించిన కాసేపటికే ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్, తానియా సచ్దేవ్, అగర్వాల్‌లతో కూడిన మహిళల జట్టు అజెర్బైజాన్ను ఓడించి పసిడి గర్జన చేసింది.
Congratulations Team India pic.twitter.com/SdZm69g20E
— All India Chess Federation (@aicfchess) September 22, 2024