విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ .. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారు. ఆయన కాలినడకన ద్వారా తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఓ డిమాండ్ చేసింది. వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆయన ఏ మతస్థుడో డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Purandeswari) డిమాండ్ చేశారు. ఒకవేళ అన్యమతస్తుడైతే, అప్పుడు వాళ్లు తాము ఏ మతాన్ని నమ్ముతున్నారో డిక్లరేషన్లో పేర్కొనాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ తన మతం ఏంటో చెప్పిన తర్వాతే ఆయన దర్శనానికి వెళ్లాలని, తిరుమల మెట్లు ఎక్కడానికి ముందే ఆ డిక్లరేషన్ ఇవ్వాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
#WATCH | Vijayawada: Daggubati Purandeswari, BJP MP and Andhra Pradesh BJP President says, ” Former CM Jagan Mohan Reddy is coming to visit Tirumala Tirupati Devasthanam and he intends to take darshan of Lord Venkateshwara. The demand of BJP is that whoever comes for darshan of… pic.twitter.com/ImL5SxOkrO
— ANI (@ANI) September 26, 2024