Suriya 44 | సూర్య (Suriya) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో శివ (Siva) దర్శకత్వం వహిస్తున్న కంగువ విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43 ప్రాజెక్ట్‌తో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటిలో కార్తీక్ సుబ్బరాజు-సూర్య సినిమా షూటింగ్ దశలో ఉంది.
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సూర్య యంగ్ లుక్‌లో కనిపిస్తున్న స్టిల్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. పొట్టి టీ షర్ట్-జీన్స్ కాంబోలో డీ ఏజింగ్ లుక్‌లో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు సూర్య. ఈ స్టార్ యాక్టర్ మాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్, సోదరుడు కార్తీతో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ముగ్గురిలో సూర్య లుక్ పైనే అందరి ఫోకస్ పడింది.
సూర్య ఇంతకీ కార్తీక్ సుబ్బరాజు సినిమా కోసమే ఇలా మారిపోయాడా..? లేదంటే కొత్త సినిమా ప్లాన్‌లో భాగంగా ఇలా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి ఈ స్టిల్ వెనుక ఏదైనా సీక్రెట్ ఉందేమో సూర్య నుంచి క్లారిటీ వస్తుందో చూడాలి.
ఈ సినిమాలు ట్రాక్‌పై ఉండగానే మరోవైపు సూర్య 45 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేయబోతుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడని ఇన్సైడ్ టాక్.
• We May EXPECT the unEXPECTed Collaborations 😁✌️@Suriya_offl ♥️ @ttovino ♥️ @Karthi_Offl #TheONE #KanguvaFromNov14 #Suriya44 #Kanguva pic.twitter.com/sbOlETXkT0
— Hari™ (@Hari_Socialist) September 26, 2024
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్