PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)ని సింధు మనువాడనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి స్టార్ షట్లర్ తొలిసారి స్పందించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింధును విలేకరులు పెళ్లి గురించి ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘అవును, ఈనెల 22న నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ సమాధానమిచ్చారు.
#WATCH | Hyderabad, Telangana | On her wedding, ace badminton player and two-time Olympic medalist, PV Sindhu says, “It’s all around the social media. Yes, I am getting married on 22nd (December)…” (04.12) pic.twitter.com/51nmALxFAw
— ANI (@ANI) December 5, 2024
కాగా, సింధు పెళ్లి చేసుకునే వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కానీ నెల క్రితమే పెళ్లి ఖాయమైంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడబోతోంది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించాం. డిసెంబర్ 22న పెళ్లి వేడుక జరిపించేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకుని ముహూర్తం పెట్టించాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. వచ్చే సీజన్ చాలా ముఖ్యమైనది కాబట్టి సింధు త్వరలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెడుతుంది’ అని ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. వీరి వివాహం ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో అంగరంగా వైభవంగా జరగనుంది. ఇక డిసెంబర్ 20న సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి.
Also Read..
“PV Sindhu | సింధుకు కాబోయే భర్త ఎవరు..? ఐపీఎల్‌తో అనుబంధం.. ఆసక్తికర విషయాలు మీకోసం”
Malaika Arora | ఫిష్‌కట్ డ్రెస్స్‌లో పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా
Chandrababu | డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుదల : ఏపీ సీఎం చంద్రబాబు