అమరావతి : ఏపీలో డీప్ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. వంద శాతం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలి అనేది మా ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్ ఇన్నోవేషన్ (Deeptech Innovation) కాంక్లేవ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సాంకేతికతను అందిపుచ్చుకుంటుందని పేర్కొన్నారు.
టెక్నాలజీ జీవితంలో ఒక భాగంగా మారిందని అన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని, విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణులుఓ్ల 30శాతం తెలుగువారే ఉండడం గర్వకారణమని వెల్లడించారు. ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే, అన్ని ఎక్కువ రాయితీలు మా ప్రభుత్వం ఇస్తుందని , పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.
నదుల అనుసంధానంతో నీటి కొరత అనేదే ఉండదు. ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతోందని తెలిపారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని అన్నారు. రాష్ట్రానికి ఉన్న వనరుల్లో తీరప్రాంతం ఒకటని, తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరగడంతో పాటు రాష్ట్రా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో వచ్చిన అనేక సమస్యలను అధిగమిస్తున్నామని, . సెకండ్ క్వార్టర్ లో, దేశ గ్రోత్ రేట్ 8 % అయితే, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 8.75% కి వచ్చామని తెలిపారు.