శనివారం 06 మార్చి 2021
Sports - Jan 22, 2021 , 18:58:13

థాయ్‌లాండ్‌ ఓపెన్‌..పీవీ సింధుకు షాక్‌

 థాయ్‌లాండ్‌ ఓపెన్‌..పీవీ సింధుకు షాక్‌

బ్యాంకాక్‌: టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌- 1000 టోర్నీలో  భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌  పీవీ సింధు కథ ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో    పేలవ ప్రదర్శనతో  ఘోరంగా నిరాశపరిచింది.  శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌  క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో  ఆరోసీడ్‌  సింధు 13-21, 9-21తో థాయ్‌లాండ్‌ షట్లర్‌ రచనోక్‌ ఇంటానన్‌ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు గేమ్‌ల్లో   సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన రచనోక్‌..సింధును మట్టికరిపించింది. 

పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు సమీర్‌ వర్మ పోరాడి ఓడాడు.  క్వార్టర్‌ పైనల్లో సమీర్‌  13-21, 21-19, 20-22తో     వరల్డ్‌ నంబర్‌ 3 ఆండర్స్‌ ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

VIDEOS

logo