ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా
Man married six women: ఆరో పెండ్లి విషయం తెలుసుకున్న ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బాబా బాగోతం బయటపడింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహనాజ్‌పూర్‌కు చెందిన ఓ దొంగ బాబా ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఆరుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆరో పెండ్లి విషయం తెలుసుకున్న ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బాబా బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటి సారి వివాహం అయ్యింది.
పెండ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె కూడా అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత నాలుగేండ్లకు అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న నాలుగో భార్య
ఆ తర్వాత కొద్ది రోజులకే మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు. అయితే, పెండ్లి తర్వాత అనూజ్ నిజ స్వరూపం తెలుసుకున్న నాలుగో భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదోసారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఐదో భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉండ సాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ ఆరో పెండ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

