PKL | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. శనివారం గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 38-35తో బెంగళూరు బుల్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
టైటాన్స్ తరఫున పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), అశీష్ నర్వాల్, అజిత్ పవార్, విజయ్ మాలిక్ రాణించారు. టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచ్‌లలో మూడో విజయం కాగా బెంగళూరుకు ఆరు మ్యాచ్‌లలో ఐదో పరాజయం.