IPL 2025 : సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(103) విధ్వంసక సెంచరీ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 39 బంతుల్లోనే శతకంతో గర్జించాడీ హిట్టర్. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడీ యంగ్‌స్టర్. పవర్ ప్లేలోపే 3 కీలక వికెట్లు పడిన పంజాబ్‌ను ఆదుకున్న ప్రియాన్ష్.. శశాంక్ సింగ్(54 నాటౌట్)జతగా కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
డెత్ ఓవర్లలో మార్కో యాన్సెస్(34 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ స్కోర్ 19 ఓవర్‌కే రెండొందలు దాటింది. పథిరన వేసిన ఆఖరి ఓవర్లో శశాంక్ ఒక సిక్సర్ బాదగా.. చివరి బంతికి 3 రన్స్ తీశారు. దాంతో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ కొట్టింది. ఇప్పటివరకూ 190 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్కే ఈసారి అద్బుతం చేస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Saving this to our ‘Special Moments’ folder 📂 😌
A knock of the highest caliber from Priyansh Arya as he scores 1️⃣0️⃣3️⃣(42) 💥
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @PunjabKingsIPL pic.twitter.com/BsPfEoKhiB
— IndianPremierLeague (@IPL) April 8, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఆదిలో తడబడినా అనూహ్యంగా పుంజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ల విజృంభణతో మూడు ఓవర్లలోపే రెండు కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఇన్నింగ్స్‌కు ప్రియాన్ష్ అర్య(103) మూల స్తంభంలా నిలిచాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్(0) శ్రేయాస్ అయ్యర్(9), మార్కస్ స్టోయినిస్(7)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. ముకేశ్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన ప్రియాన్ష్ జట్టు స్కోర్ 50 దాటించాడు.
That maiden #TATAIPL 5️⃣0️⃣ feeling ☺
And in some style 💪Priyansh Arya smashes a 19-ball half-century 👊#PBKS are 75/3 after 6 overs
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #PBKSvCSK pic.twitter.com/9rnTYbbYdu
— IndianPremierLeague (@IPL) April 8, 2025
పవర్ ప్లే ఆఖరి బంతికి అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఆ కాసేటపికే నేహల్ వధేరా ఔటైనా.. శశాంక్ సింగ్(54 నాటౌట్) జతగా ప్రియాన్ష్ సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ప్రియాన్ష్.. తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని శతకంగా మలిచాడు. మరో 20 బంతుల్లోనే సెంచరీకి చేరువయ్యాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో అత్యంత వేగవంతమైన వంద బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నాడు ప్రియాన్ష్. అతడు ఔటయ్యాక యాన్సెన్(34 నాటౌట్) మెరుపులతో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగలిగింది.