గట్టుప్పల్, ఏప్రిల్ 08 : పాఠశాల ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంగళవారం పాఠశాల గేటు ముందు ఆందోళన నిర్వహించారు. వర్షం పడితే స్కూల్ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే పాఠశాల ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక రాజకీయ నాయకులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.