కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి గిరినగర్కు చెందిన ఫొటోగ్రాఫర్ భీమనపల్లి గణేశ్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శభాష్ గూడెంలో ఇవాళ గణేశ్ దశ దినకర్మ నిర్వహించారు. ఈ దశదినకర్మలో చింతల్ ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొని గణేశ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తమ యూనియన్ ద్వారా సేకరించిన రూ.70 వేలను ఊరి పెద్దల సమక్షంలో గణేశ్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ వేణు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.