Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన హ్యారీ బ్రూక్(99) సెంచరీ చేజార్చుకున్నాడు. శతకానికి ఒక్క పరుగు అవసరమైన వేళ ప్రసిధ్ బౌలింగ్‌లో షార్ట్ బంతిని ఆడి శార్ధూల్ చేతికి చిక్కాడు. దాంతో.. ఏడో వికెట్ 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రిస్ వోక్స్(13), బ్రైడన్ కార్సే(2)లు క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ 67పరుగులు వెనకబడి ఉంది.
లంచ్ తర్వాత జోరు పెంచిన హ్యారీ బ్రూక్(99), వికెట్ కీపర్ జేమీ స్మిత్(40)లు బౌండరీలతో చెలరేగారు. అయితే.. ప్రసిధ్ బౌలింగ్‌లో స్మిత్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద జడేజా, సాయి సుదర్శన్ కలిసి అందుకున్నారు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ అండగా జట్టు స్కోర్ బోర్డును ఉరికించిన బ్రూక్స్ సెంచరీ దిశగా సాగాడు. అయితే.. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గల్లీలో యశస్వీ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన బ్రూక్.. సిక్స్, ఫోర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. కానీ, ప్రసిధ్ తెలివిగా విసిరిన బంతిని నియంత్రణ లేకుండా ఆడి అయ్యో అని తలపట్టుకున్నాడీ యంగ్‌స్టర్.
Wicket No. 3⃣ for Prasidh Krishna! 👍
England 7 down as Harry Brook gets out.
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #TeamIndia | #ENGvIND | @prasidh43 pic.twitter.com/fQsRUgxwTg
— BCCI (@BCCI) June 22, 2025