Mohammed Siraj: ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్ నుంచి సిరాజ్ ఔట్
Mohammed Siraj: వర్క్‌లోడ్ వల్ల సిరాజ్‌ను తప్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి అతన్ని ఉపసంహరించారు. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. బీసీసీఐ ఇవాళ ఈ ప్రకటన చేసింది.
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల నుంచి హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను తప్పించింది. అధిక పనిభారం వల్ల సిరాజ్‌ను ఆ టోర్నీల నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఇవాళ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. సిరాజ్ స్థానంలో ప్రసిద్ధి కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. సుదీర్ఘమైన అంతర్జాతీయ సీజన్ ముందున్న నేపథ్యంలో.. సిరాజ్‌పై వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తగా అతన్ని ఆ టూర్లకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ మెడికల్ టీమ్, జట్టు యాజమాన్యం మధ్య జరిగిన చర్చల ద్వారా సిరాజ్‌ను ఉపసంహరించాలన్న నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్‌కు రెస్ట్ అడ్వైజ్ చేశారు. రెండు సిరీస్‌లకు సిరాజ్ స్థానంలో పేస్ బౌలర్‌గా ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నట్లు బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
జట్టు వివరాలు..
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్‌సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ కృష్ణ.
🚨 News 🚨
Prasidh Krishna replaces Mohd. Siraj in #TeamIndia‘s T20I squads for Ireland & England.
Siraj has been advised a period of rest as part of his workload management programme.
More Details 🔽 | #IREvIND | #ENGvINDhttps://t.co/LNPOVVVHq5
— BCCI (@BCCI) June 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

