IPL 2025 : ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(91) వీరవిహారం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫోర్లు, సిక్సర్లతో విజృంభించిన అతడికి శ్రేయస్ అయ్యర్(45) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సహకరించాడు. ఇక డెత్ ఓవర్లలో బ్యాట్ ఝులిపించిన శశాంక్ సింగ్(29 నాటౌట్), మార్కస్ స్టొయినిస్(15 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. దాంతో, పంజాబ్ ప్రత్యర్థి ముందు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఈ మైదానంలో జరిగిన టీ20ల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ కీలక పోరులో భారీ స్కోర్ చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను చితక్కొ విధ్వంసక ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(1) తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన బంతిని అతడు థర్డ్ మ్యాన్ దిశగా ఆడగా మయాంక్ ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(30) .. మయాంక్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో పంజాబ్ స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. ఈ చిచ్చరపిడుగును వెనక్కి పంపిన ఆకాశ్ రెండో వికెట్ సాధించాడు. అయినా సరే ఇక, 21 పరుగుల వద్ద ప్రభ్‌సిమ్రన్ సింగ్(91 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు)కు లైఫ్ లభించింది. అవేశ్ ఖాన్ ఓవర్లో అతడు గాల్లోకి లేపిన బంతిని పూరన్ అందుకోలేకపోయాడు.
Innings Break!
A mountainous batting effort by #PBKS ❤️ #LSG‘s chase underway 🔜
Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/gMM8nAUx6V
— IndianPremierLeague (@IPL) May 4, 2025
దొరికిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ప్రభ్‌సిమ్రన్ ఆపై దంచికొట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(45), నేహల్ వధేరా(16)లతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రథీ బౌలింగ్‌లో అయ్యర్, ప్రిన్స్ ఓవర్లో నేహల్ వెనుదిరిగారు. ఆ తర్వాత శశాంక్ సింగ్ (33 నాటౌట్) తోడుగా ప్రభ్‌సిమ్రన్ రెచ్చిపోయాడు. అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది సెంచరీకి చేరువయ్యాడు. పంజాబ్ స్కోర్ 200లు దాటింది. అయితే.. దిగ్వేశ్ రథీ ఓవర్లో స్వీప్ షాట్ ఆడి పూరన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్కస్ స్టోయినిస్(15 నాటౌట్) 20వ ఓవర్లో సిక్సర్ కొట్టగా.. శశాంక్ చివరి బంతిని బౌండరీ దాటించాడు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది.