లక్నో: కొన్న వస్తువులను తిరిగి తీసుకునేందుకు షాపు వ్యక్తి నిరాకరించాడు. ఆ యువతి తిట్టి బెదిరించడంతో చివరకు వస్తువులు తీసుకుని డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ షాపు నుంచి వెళ్లేటప్పుడు షాపులోని వ్యక్తిపై బ్లేడ్‌తో ఆమె దాడి చేసింది. (Shopkeeper attacked with blade by girl) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలిక స్థానిక షాపులో కొన్న వస్తువులను ఆ తర్వాత వెనక్కి ఇచ్చేది.
కాగా, ఆ బాలిక మరోసారి కూడా అలాగే చేసింది. ఆ షాపు వద్దకు వచ్చి కొన్న వస్తువులను తిరిగి వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కొన్న వస్తువులను తిరిగి తీసుకునేందుకు షాపు సిబ్బంది తొలుత నిరాకరించారు. ఆ యువతి అక్కడి చైర్లో కూర్చొని గొడవ చేసింది. డబ్బులు ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని మెండికేసింది. వారిని తిట్టడంతోపాటు బ్లేడ్‌తో దాడి చేస్తానని బెదిరించింది.
మరోవైపు ఇదే చివరి సారి అని, ఇకపై కొన్న వస్తువులను తిరిగి తీసుకోబోమని ఆ షాపులోని వ్యక్తులు చెప్పారు. వస్తువులు తీసుకుని డబ్బులు తిరిగి ఇచ్చారు. అయితే కుర్చీ నుంచి పైకి లేయిన ఆ యువతి షాపు వ్యక్తి చేతిపై బ్లేడ్‌తో దాడి చేసింది. ఆ షాపు నుంచి బయటకు పరుగెత్తింది.
కాగా, అప్రమత్తమైన సిబ్బంది ఆ యువతిని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీంతో మైనర్ బాలికను జువైనల్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Caught on camera: A 15-year-old girl attacks a shopkeeper with a blade after he refused to take back her purchase 🏪🔪. The shocking incident leaves him injured.#UttarPradesh #ShockingNews #ViralVideo #CrimeNews pic.twitter.com/Q7TopkHCr4
— HK Chronicle (@HK_Chronicle_) May 4, 2025