West Indies Cricket : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న వెస్టిండీస్ (West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 1-2తో ఓడించిన కరీబియన్ జట్టు ఇక తమకు ఎంతో ఇష్టమైన టీ20 సిరీస్‌కు కాచుకొని ఉంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 సిరీస్ నేపథ్యంలో విండీస్ సెలెక్టర్లు తొలి రెండు మ్యాచ్‌లకు బలమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు.
పొట్టి ఫార్మాట్ అంటే చాలు పూనకాలు వచ్చినట్టు ఆడే ఆండ్రూ రస్సెల్, నికోలస్ పూరన్, షిమ్రన్ హెట్మైర్లకు 15 మందితో కూడిన బృందంలో సెలెక్టర్లు చోటు కల్పించారు. ఊహించినట్టుగానే నిషేధానికి గురైన సీనియర్ పేసర్ అల్జారీ జోసెఫ్‌ను పక్కన పెట్టేశారు.
🚨BREAKING NEWS🚨
CWI name the T20I squad against England in The Rivalry, Nov 9 – 17.💥#TheRivalry | #WIvENG pic.twitter.com/VPxFGlAf7h
— Windies Cricket (@windiescricket) November 8, 2024
‘ప్రస్తుతం ఎంపిక చేసిన టీ20 జట్టులో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారు. విండీస్ తరఫున టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న జట్టు కూడా ఇది. అయితే.. కష్టమైన విషయం ఏంటంటే 11 మందిని ఎంపిక చేయడం. ప్రతి ఒక్కరు తుది జట్టులో ఉండేందుకు పోటీపడేవాళ్లే. ఇప్పుడు మేము ఎంపిక చేసిన స్క్వాడ్ తమ బ్రాండ్ క్రికెట్ ఆడి.. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని హెడ్‌కోచ్ డారెన్ సమీ స్క్వాడ్ తెలిపాడు. విండీస్, ఇంగ్లండ్‌ల మధ్య నవంబర్ 9న తొలి టీ0 జరుగనుంది.
తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రన్ హిట్మైర్, టెర్రన్సే హిండ్స్, షాయ్ హోప్, అకీల్ హొసేన్, మాథ్యూ ఫొర్డే, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లెవిస్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రే రస్సెల్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్.