చండీగఢ్: షాపు బయట కూర్చొన్న తండ్రి, కొడుకు మీదకు ట్రాక్టర్ దూసుకెళ్లింది. (Tanker Hits Father, Son) ఇది చూసి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నాగ్లా ఘాజీపూర్ రోడ్డు సమీపంలోని ఒక షాపు ముందు తండ్రీకొడుకులు కూర్చొన్నారు. ఇంతలో సెప్టిక్ ట్యాంకర్ ట్రాక్టర్ వారిద్దరిపైకి దూసుకెళ్లింది.
కాగా, కంగారుపడిన ట్రాక్టర్ డ్రైవర్ కిందకు దిగాడు. అక్కడ గుమిగూడిన స్థానికులు ఆ ట్రాక్టర్ డ్రైవర్‌ను కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఒక వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను వెనక్కి నడిపాడు. గాయపడిన తండ్రి, కుమారులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా వారి మీదకు దూసుకెళ్లాడా లేక వాహనం అదుపు తప్పిందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Two people, a father and son, were injured in Faridabad when a sewer tanker struck them while they were sitting outside a local shop. The incident, captured on CCTV near Nagla Ghazipur Road, has left locals questioning whether the driver lost control or hit them intentionally… pic.twitter.com/75aqmP6Zv5
— India Today NE (@IndiaTodayNE) November 9, 2024