KTR | జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్ అరెస్ట్ అప్రజాస్వామికమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రశ్నించే వారంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు అని ప్రశ్నించారు. వైఆర్ టీవీ రంజిత్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్‌మీడియా వేదికగా కేటీఆర్ విరుచుపడ్డారు.
రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 1 నెలల కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు నిత్యం కృత్యమయ్యాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసినందుకే రంజిత్‌ను నిర్భందించారని అన్నారు. వెంటనే రంజిత్‌ను విడుదల చేయాలని.. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్భందాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
రంజిత్‌ను వెంటనే విడుదల చేయాలి : హరీశ్‌రావు
వైఆర్ టీవి రంజిత్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. నిఘా వేసి, రెక్కీ నిర్వహించి ఒక జర్నలిస్టును నిర్బందించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రజల తరుపున నిలదీస్తే సంకెళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తప్పులను ఎత్తి చూపితే అరెస్టు చేస్తారా? కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన రంజిత్‌ను వెంటనే విడుదల చేయాలని, అతని పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.