IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. వేదిక ఏదైనా తమ విధ్వంసంతో కొండంత స్కోర్ అందిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో నికోలస్ పూరన్(86 నాటౌట్) పట్టపగలే కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడిగు అర్ధ శతకంతో గర్జించాడు. ఓపెనర్ షాన్ మార్ష్(81) సైతం తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ మెరుపులతో ఆఖరి ఐదు ఓవర్లలో 86 పరుగులు రాబట్టింది. వీళ్లిద్దరి విధ్వంసక బ్యాటింగ్ ఫలితంగా కోల్‌కతా కంచుకోటలో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు షాన్ మార్ష్(81 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎడెన్ మర్క్రమ్(47)లు శుభారంభం ఇచ్చారు. కోల్‌కతా బౌలింగ్ దళాన్ని చీల్చిచెండాడిన వీళ్లు పవర్ ప్లేలోనే 59 రన్స్ పిండుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు అజింక్య రహానే ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. అయితే.. 11వ ఓవర్లో హర్షిత్ రానా సూపర్ డెలివరీతో మర్క్రమ్ను బోల్డ్ చేసి కోల్‌కతాను బ్రేకిచ్చాడు. ఆ తర్వాత సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మార్ష్‌ను రస్సెల్ బోల్తాకొట్టించాడు. దాంతో, 170 వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది.
Going…Going…GONE! 🚀
Raining sixes in Kolkata courtesy of Nicholas Pooran 💪
He brings up a 21-ball 5️⃣0️⃣ 🤯
Updates ▶ https://t.co/3bQPKnwPTU#TATAIPL | #KKRvLSG | @nicholas_47 pic.twitter.com/GYxDjAQSMX
— IndianPremierLeague (@IPL) April 8, 2025
షాన్ మార్ష్ ఔటయ్యాక నికోలస్ పూరన్(86 : 35 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం తారాస్థాయికి చేరింది. ఈ పవర్ హిట్టర్.. హర్షిత్, రస్సెల్‌కు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన పూరన్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రస్సెల్ వేసిన 18వ ఓవర్లో 4, 4, 6, 4, 6 బాదిన ఈ చిచ్చర పిడుగు 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో, లక్నో స్కోర్ 200 దాటింది. వైభవ్ వేసిన 20వ ఓవర్ తొలి బంతినే బౌండరీకి పంపాడు పూరన్. ఆ తర్వాతి ఐదు బంతుల్లో 6 రన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో, లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.