సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై స్పష్టత
గత సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆ శాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
- తాజాగా పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : గత సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆ శాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ నిధులు రూ.245.00 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 2024-25గాను బేసిక్ అన్ టైడ్, టైడ్ గ్రాంట్స్ కింద రూ.640.07 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
గత సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన నేపథ్యంలో 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గత సర్పంచులకు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. 2023-24 టైడ్ కాంపొనెంట్ కింద విడుదలైన నిధులపై గత సర్పంచుల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీపర్పస్ వరర్లు వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు జిల్లాల స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

