Allu Arjun | అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వైరం నడుస్తుందంటూ కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ఎన్నికల సమయం నుండి రెండు కుటుంబాల మధ్య విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. బన్నీ అరెస్ట్ సమయంలో అతను చిరంజీవి ఇంటికి వెళ్లడంతో గొడవలు సద్దుమణిగాయేమో అని అంతా అనుకున్నారు. కాని రామ్ చరణ్ పుట్టిన రోజుకి బన్నీ విషెస్ చెప్పకపోవడం మళ్లీ అనుమానాలు కలిగేలా చేసింది. ఇక ఈ రోజు అర్జున్ పుట్టినరోజున కాగా, మెగా కుటుంబం నుండి ఎవరు శుభాకాంక్షలు చెప్పకపోవడంతో అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ వైడ్‌గా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఫ్యాన్స్ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మెగా కాంపౌండ్ నుండి ఎవరు కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చిరంజీవి తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల బర్త్ డేకి తప్పనిసరిగా విషెస్ చెబుతారు. కాని ఇప్పుడు బన్నీకి చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. ఇతర మెగా హీరోలు ఎవరు కూడా స్పందించలేదు. కాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అల్లు అర్జున్‌కి ప్రేమతో విషెస్ చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ అని సంభోదిస్తూ ఈ ఏడాది మంచి విజయాలు అందుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ఇక ఇదిలా ఉంటే బన్నీకి ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో వస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ విడుదల సమయంలో కూడా అల్లు అర్జున్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. మరోవైపు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కూడా బన్నీ పెద్దగా కనిపించడం లేదు. అల్లు అరవింద్ మాత్రమే అలా కనిపిస్తూ వెళుతున్నాడు కాని ఇటీవలి కాలంలో బన్నీ మెగా హీరోలతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువే. ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా హీరోల వైరం అలాగే కొనసాగుతుందని అర్థమవుతోంది. మరి దీనికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.