INDW vs SAW : చావోరేవో లాంటి మూడో టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపారు. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ (4/13) నాలుగు వికెట్లతో సఫారీల నడ్డి విరిచింది. స్పిన్నర్ రాధా యాదవ్ కూడా తిప్పేయడంతో దక్షిణాఫ్రికా 84 పరుగులకే ఆలౌటయ్యింది.
సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో భారత అమ్మాయిలు కదం తొక్కారు. పేసర్ పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దాంతో, పర్యాటక జట్టు ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ సాగింది. టాస్ ఓడిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది.
Innings Break!
A fantastic bowling display from #TeamIndia 👏👏
4⃣ wickets for Pooja Vastrakar
3⃣ wickets for Radha YadavA wicket each for Shreyanka Patil, Deepti Sharma & Arundhati Reddy
Chase coming up! ⏳
Scorecard ▶️ https://t.co/NpEloo68KO#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/zY2BG3sn2F
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
రెండు మ్యాచుల్లో తేలిపోయిన ఇండియన్ బౌలర్లు పవర్ ప్లేలోనే రెండు బిగ్ వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ లారా వొల్వార్డ్త్(9)ను ఔట్ చేసిన శ్రేయాంక పాటిల్ ఇండియాకు బ్రేకిచ్చింది. ఆ తర్వాత డేంజరస్ మరిజానే కాప్(10)ను పూజా వస్త్రాకర్ బౌన్సర్‌తో బోల్తా కొట్టించింది. దాంతో, 30 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
#TeamIndia continue to make a mark with the ball in Chennai!
Radha Yadav & Arundhati Reddy with the breakthroughs ⚡️⚡️
South Africa 8⃣ down.
Follow the match ▶️ https://t.co/NpEloo68KO#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/VmURLjsDNg
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
అనంతరం తంజిమ్ బ్రిట్స్(20), ఎలెనె బొస్చ్(0)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ, దీప్తి శర్మ తన తొలి ఓవర్లోనే తంజిమ్ వికెట్ తీసి సఫారీలను మరింత ఒత్తిడిలోకి తోసేసింది. ఇక ఆ తర్వాత 11వ ఓవర్లో పూజా రెండు వికెట్లు తీసి లారా బృందాన్ని ఆలౌట్ ప్రమాదంలోకి నెట్టింది. రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలు టెయిలెండర్ల పని పట్టారు. 16. వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.