Health tips | మీరు మధుమేహులా.. బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Health tips : బొబ్బర్లు..! వీటినే అలసందలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువ. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి. జీర్ణశక్తికి కూడా తోడ్పడుతాయి. శరీరంలో విషాలను తొలగిస్తాయి. మరి బొబ్బర్లతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Health tips : బొబ్బర్లు..! వీటినే అలసందలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువ. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి. జీర్ణశక్తికి కూడా తోడ్పడుతాయి. శరీరంలో విషాలను తొలగిస్తాయి. మరి బొబ్బర్లతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు
- అధిక బరువుతో బాధపడే వారికి బొబ్బర్లు మంచి ఉపయోగకరమైన ఆహారం. బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
- మధుమేహులకు లో-గైసిమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
- బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు. ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
- బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.
- అదేవిధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- బొబ్బర్లలోని అధిక ప్రొటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

