సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 00:36:07

విరామం తప్పనిసరి

విరామం తప్పనిసరి

  • బబుల్‌తో మానసిక అలసట: శాస్త్రి 

చెన్నై: బయోబబుల్‌లో సుదీర్ఘంగా ఉండడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. క్వారంటైన్‌ లాంటివి మానసిక అలసటకు గురిచేస్తాయని, అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత భారత ఆటగాళ్లకు రెండు వారాల విరామం తప్పనిసరిగా ఉండాలని శుక్రవారం ఓ టీవీ షోలో చెప్పాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో ఒక సమయంలో విరామం ఉండాల్సిందే. ఇంగ్లండ్‌ సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌కు వెళ్లాలి. అయితే ఐపీఎల్‌ అనంతరం రెండు వారాల బ్రేక్‌ తప్పనిసరి. ఈ క్వారంటైన్లు, బబుల్స్‌ వల్ల మానసికంగా నీరసం వస్తుంది. అలసిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే మనమంతా మనుషులం. విరామం కచ్చితంగా కావాలి’ అని శాస్త్రి అన్నాడు. అలాగే టీమ్‌ఇండియా బెంచ్‌ సామర్థ్యం ఎంతో ఉందని, ప్రతీఒక్కరు సత్తాచాటాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలిపాడు.


VIDEOS

తాజావార్తలు


logo