NZ vs AUS 1st Test | ఫిలిఫ్స్ స్పిన్ మాయ.. న్యూజిలాండ్ గెలుపు ఆశలన్నీ మిడిలార్డర్‌పైనే
NZ vs AUS 1st Test : వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్(Newzealand) పోరాడుతోంది. పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glen Philiphs) ఐదు వికెట్ల ప్రదర్శనకు రచిన్ రవీంద్ర(56 నాటౌట్) అర్థ సెంచరీ తోడవ్వడంతో మ్యాచ్‌పై...
NZ vs AUS 1st Test : వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్(Newzealand) పోరాడుతోంది. పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glen Philiphs) ఐదు వికెట్ల ప్రదర్శనకు రచిన్ రవీంద్ర(56 నాటౌట్) అర్థ సెంచరీ తోడవ్వడంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడో రోజు ఫిలిఫ్స్ విజృంభణతో ఆస్ట్రేలియా 164 రన్స్‌కే ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ మూడు వికెట్ల నష్టానికి 111 రన్స్ కొట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్, డారిల్ మిచెల్(12 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇంకా న్యూజిలాండ్ విజయానికి 258 పరుగులు కావాలి.
తొలి ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్ సెంచరీతో ఆస్ట్రేలియా 383 పరుగులు బాదింది. అనంతరం నాథన్ లియాన్(Nathan Lyon) 4 వికెట్లు తీయడంతో కివీస్ 129 పరుగులకే కుప్పకూలింది. దాంతో, ఆసీస్‌కు 203 పరుగుల ఆధిక్యం లభించింది.
GP was revved up after that 🖐️! #NZvAUS pic.twitter.com/I51lDBEwb1
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టులో లియాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిడిలార్డర్‌ను కకావికలం చేసిన ఫిలిఫ్స్ కెరీర్లో మొదటిసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ను తక్కువకే కట్టడి చేసిన న్యూజిలాండ్‌ను ఓపెనర్లు టామ్ లాథమ్(8), విల్ యంగ్(15)లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన విలియమ్సన్(9)ను లియాన్ బోల్తా కొట్టించాడు.
Rachin Ravindra & Daryl Mitchell steady the ship to ensure Day 3 is New Zealand’s
Game on?
👉https://t.co/xgMWgIb07R | #NZvAUS pic.twitter.com/I8vZz3QtZ9
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2024
ఆ తర్వాత మార్ష్, రవీంద్రలు ఆచితూచి ఆడారు. నాలుగో వికెట్‌కు 52 పరుగుల జోడించి న్యూజిలాండ్‌ను గెలుపు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నాలుగో రోజు కివీస్ బ్యాటర్లు నిలబడతారా? లేదా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
- MLA Talasani | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో పీవీ నరసింహారావు ఒకరు: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
- Shock for YCP | వైసీపీకి షాక్.. ఎంపీ, ఎమ్మెల్యే టీడీపీలో చేరిక
- Azam Cheema | 26/11 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

