Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి సమన్లు జారీ చేసిన సిట్
Prajwal Revanna: అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ఇవాళ మరోసారి సిట్ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు ఏడు రోజుల సమయం కావాలని ప్రజ్వల్ చేసిన అభ్యర్థనను సిట్ కొట్టిపారేసింది. దర్యాప్తునకు ప్రజ్వల్ హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ఇవాళ కూడా ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు ప్రత్యేక దర్యాప్తు బృందం సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని తాజా సమన్లలో ఆదేశించింది. విచారణకు హాజరయ్యేందుకు ఏడు రోజుల సమయం కావాలని ప్రజ్వల్ పెట్టుకున్న అభ్యర్థనను సిట్ కొట్టిపారేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలకు చెందిన కేసును సిట్ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే.
24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని నిన్న సిట్ ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోవటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు.
తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించాడు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించాడు. సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలని, ఇప్పుడు తాను బెంగళూరులో లేనట్లు అతను ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. దర్యాప్తునకు ప్రజ్వల్ హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

