MLA Talasani | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో పీవీ నరసింహారావు ఒకరు: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
MLA Talasani | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు ఒకరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు.
హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు ఒకరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. ఇటీవల పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్బంగా శనివారం బేగంపేటలోని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao) భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీవీ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పీవీ నర్సింహా రావు కు భారతరత్న(Bharat Ratna) ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని పేర్కొన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎంతో విశేషమైన సేవలు అందించారని గుర్తుచేశారు. ఆర్ధిక సంస్కరణలు(Economical reforms)తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు.
తన పరిపాలన దక్షతతో ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పారని, అలాంటి మహనీయుడికి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్(BRS) అనేక సార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, కుమారుడు ప్రభాకర్ రావు, కార్పొరేటర్ టి.మహేశ్వరి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

