Ilaiyaraaja | సన్ పిక్చర్స్‌కు నోటీసులు పంపిన సంగీత దర్శకుడు ఇళయరాజా..!
Ilaiyaraaja | ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ యాక్ట్ కింద నోటీసులు పంపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రజనీకాంత్ 171వ చిత్రం కావడం విశేషం.
Ilaiyaraaja | ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ యాక్ట్ కింద నోటీసులు పంపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రజనీకాంత్ 171వ చిత్రం కావడం విశేషం. ఇటీవల మూవీ టైటిల్ టీజర్ మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. అయితే, టీజర్లో అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడుకున్నారని ఇళయరాజా నోటీసుల్లో ఆరోపించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నది. ఇక మూవీలో రజనీకాంత్ నటించిన ‘తంగమగన్’ చిత్రంలోని ‘వా వా పక్కం వా’ పాటలో మ్యూజిక్‌ను వాడుకున్నారు.
తన అనుమతి లేకుండా ఉపయోగించిన మ్యూజిక్‌ను తొలగించాలని.. లేకుంటే పాటకు అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకపోతే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. తన సంగీత దర్శకత్వంలోని పాటలను అనుమతి లేకుండా స్టేజ్ షోలలో సైతం ఆలపించకూడని.. సినిమాల్లో ఉపయోగించొద్దని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ 171వ చిత్రానికి ‘కూలీ’కి లోకేశ్ కనగరాజ్ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం అరునిధ్ రవిచందర్ అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

