Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం నెలకొంది. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లే పరిస్థితులు కనిపించకపోవడం.. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ససేమిరా అంటుండమే అందుకు కారణం. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి నవంబర్ 11న జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను రద్దు చేసింది. ఆ మరునాడే బీసీసీఐ అభ్యంతరాలు ఏంటో మాకు చెప్పండి అంటూ ఐసీసీని పీసీబీ కోరింది.
ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకుంటే దక్షిణాఫ్రికాలో టోర్నీని జరిపేందుకు ఐసీసీ ఆలోచలన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసినా పాక్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్ ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీ ఆ దేశ బోర్డుకు రూ.548 కోట్లు కేటాయించింది.
దాంతో, సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా పూర్తి చేసి భారీగా డబ్బులు సమకూర్చుకోవాలి అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుకుంది. కానీ, బీసీసీఐ ఇచ్చిన షాక్‌తో అంతా రివర్స్ అయింది. హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెబితేనే పాక్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరిగే వీలుంది. దీంతో.. ఇప్పుడు ఆడకత్తెరలో పోక చెక్కలా తయారైంది మొహ్సిన్ నఖ్వీ బృందం పరిస్థితి.
ఇప్పుడు పీసీబీ ముందున్న దారి ఒక్కటే. అంతర్జాతీయ క్రికెట్ మండలి సూచించినట్టు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలి. అప్పుడు భారత జట్టు మ్యాచ్‌లు తటస్థ వేదికైన యూఏఈలో జరుగుతాయి. అలా కాదని పీసీబీ మొండికేస్తే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ సిద్దంగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి ఐసీసీ కేటాయించిన రూ.548 కోట్లు హుష్‌కాకి అయినట్టే.
If the PCB refuses the hybrid model, the #CT25 could be moved to South Africa? Seriously? How is this fair to Pakistan and its fans? This is a massive insult to Pakistan and its cricket fans! Why should we lose out on hosting rights over politics?
Champions Trophy 2025 is… pic.twitter.com/TFsfJfSLTc
— S O H A I L👓 ( سہیل ) (@Msohailsays) November 12, 2024
ఆ డబ్బులతో టోర్నీని నిర్వహించడంతో పాటు దేశంలోని స్టేడియాల మరమ్మతులతో పాటు ఆదాయం పెంచుకోవాలనుకున్న పీసీబీ ఆశలు ఆడియాశలు అయినట్టే. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరగాలి. కానీ, ప్రస్తుతం నెలకొల్న అనిశ్చితి కారణంగా వేదిక ఖరారైన తర్వాతే పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయనుందని సమాచారం.