Deadpool & Wolverine | హాలీవుడ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న డెడ్‌పూల్ అండ్ వోల్వారిన్ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ & డెడ్‌పూల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం జూలై 26న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ వైడ్‌గా కలెక్షన్ల సునామి సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.7000 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది ఈ చిత్రం. మరోవైపు ఇండియాలో కూడా రూ.139 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమాలో వోల్వారిన్గా హ్యూగ్ జాక్మాన్ నటించగా.. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ నటించారు. ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా.. షాన్ లెవీ దర్శకత్వం వహించాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
Are HUGH ready for the highest grossing R-rated movie of all time?#DeadpoolAndWolverine Now Streaming on #DisneyPlusHotstar in Hindi, English, Tamil & Telugu. pic.twitter.com/FWXTZOxhwq
— Disney+ Hotstar (@DisneyPlusHS) November 12, 2024