T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ‘ఇండియాలో ఆడబోమని’ మొండిపట్టు పట్టినందుకు బంగ్లాదేశ్(Bangladesh)పై వేటు వేసింది ఐసీసీ. అనూహ్యంగా గ్రూప్ సీలో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్(Scotland) అవకాశం దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రపంచకప్‌లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతిసారి బీసీసీఐపై, భారత్‌పై విషం చిమ్మే ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తాజా వ్యాఖ్యాలే అందుకు కారణం.
ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ కో ఫిబ్రవరి 7 నుంచి మొదలవ్వనుంది. ఇప్పటికే ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంకలో వేదికలను ఖరారు చేసింది ఐసీసీ. కానీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ మార్చాలని పట్టుపట్టడం.. చివరకు స్కాంట్లాండ్ బెర్తు దక్కించుకోవడం చూస్తండగానే జరిగిపోయాయి. భారత్‌లో ఆడబోమని నిర్ణయించుకున్న బంగ్లాదేశ్ బోర్డుకు మద్దతు పలికిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు.. ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేసే ఆలోచనతో ఉంది.
PCB chairman Mohsin Naqvi casts uncertainty on Pakistan’s participation in the upcoming men’s T20 World Cup after Bangladesh were replaced at the tournament due to their refusal to travel to India
Read more: https://t.co/esGuy5sJKD pic.twitter.com/1AfQufyQR6
— ESPNcricinfo (@ESPNcricinfo) January 24, 2026
పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ శనివారం మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టును పంపాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పీసీబీ నడుచుకుంటుంది. ప్రస్తుతం మా ప్రధాని విదేశాల్లో ఉన్నారు. ఆయన రాగానే.. పాకిస్థాన్ ఆడుతుందా? బాయ్‌కాట్ చేస్తుందా? అనేది ప్రకటిస్తాం. మేము ఐసీసీ ఆదేశాలను కాదు ప్రభుత్వం ఆజ్ఞలను పాటిస్తాం. వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడం ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలకు సంకేతం.
Scotland will be heading to their seventh men’s #T20WorldCup due to Bangladesh’s refusal to travel to India due to security concerns, joining England, Italy, Nepal and West Indies in Group C
Details: https://t.co/Vy9TdM75Td pic.twitter.com/ZFHHtJgPZb
— ESPNcricinfo (@ESPNcricinfo) January 24, 2026
బంగ్లా బోర్డు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఐసీసీ మాత్రం బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించింది. కాబట్టి.. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది. ప్రపంచ క్రికెట్లో అధిక వాటా కలిగిన బోర్డులలో బంగ్లా బోర్డు ఒకటి. సో.. వాళ్ల టీమ్ కచ్చితంగా వరల్డ్‌కప్ ఆడాలి. ఒకవేళ మా ప్రభుత్వం అంగీకరించకుంటే మా స్థానంలో మరొక జట్టును ఐసీసీ తీసుకొస్తుందేమో’ అని పేర్కొన్నాడు.
భారత్‌లో కాకుండా శ్రీలంకలో లేదంటే ఎక్కడైనా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడుతామని ఐసీసీకి బంగ్లా బోర్డు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐసీసీ అంగీకరిస్తే.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో నిర్వహిస్తామని పీసీబీ ముందుకొచ్చింది. అయితే.. అటు బీసీబీకి, ఇటు పీసీబీకి షాకిస్తూ ‘గ్రూప్ స్వాపింగ్’ ప్రతిపాదనను తిరస్కరించింది ఐసీసీ.
BREAKING: Bangladesh have been replaced at the ICC Men’s T20 World Cup 2026 following their refusal to play in India
Scotland will replace them in Group C at the tournament
Full story: https://t.co/J3KzzZNLZ6 pic.twitter.com/WpzyY2ne2x
— ESPNcricinfo (@ESPNcricinfo) January 24, 2026
హెచ్చరికల్ని సైతం బేఖాతరు చేసిన బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి.. స్కాట్లాండ్కు అవకాశమిచ్చింది. ఐసీసీ నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్ బోర్డు.. మేము కూడా వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. కానీ, గ్రూప్ ఏలోని పాక్ జట్టు శ్రీలంకలోనే మ్యాచులన్నీ ఆడనుంది. కాబట్టి.. పాక్ ప్రభుత్వం, పీసీబీ లేవనెత్తే అభ్యంతరాలను ఐసీసీ పరిగణించకపోవచ్చు.