PCB : క్రికెట్లోనే కాదు ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్.. ఆట ఏదైనా కోచ్ అంటే తప్పొప్పులు చెప్పాలి. లోపాలను సరిదిద్దుతూ జట్టును విజయ పథాన నడిపించాలి. ఏ జట్టుకైనా అలాంటి కోచ్‌నే కోరుకుంటుంది. కానీ. ప్రపంచ క్రికెట్లో పాకిస్థాన్ (Pakistan) జట్టు తీరు మాత్రం విభిన్నం. ఎప్పుడు.. ఎలా ఆడుతుందో తెలియని ఆ జట్టుకు కోచింగ్ ఇవ్వడం ఎవరికైనా శక్తికి మించిన పనే. అందుకనే పాక్ టీమ్‌కు సుదీర్ఘ కాలం కోచ్‌గా సేవలందించాలంటే నమ్మిన సిద్దాంతాలకు నీళ్లు వదలాల్సిందే. గత రెండేండ్లలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వివాదాస్పద నిర్ణయాలు.. కోచ్‌ల మార్పు అందుకు సాక్ష్యంగా నిలిచాయి.
తాజాగా గ్యారీ కిరిస్టన్ (Gary Kirsten) ‘నేను కోచింగ్ ఇవ్వలేను’ అంటూ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. దాంతో, మరోసారి పాక్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ మాజీ ఆటగాడు బసిత్ అలీ (Bastit Ali) సైతం తమ బోర్డుపై మండిపడ్డాడు. ‘పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చాలా శక్తిమంతుడు. అతడికి నచ్చకుంటే కోచ్‌లు, సెలెక్టర్లు, మేనేజర్లు.. అందర్నీ తొలగిస్తాడు.
గతలో పీసీబీ చైర్మన్ పదవీకాలం ముగియగానే తొలగించేవాళ్లు. కానీ, ఇప్పుడలా జరగడం లేదు. ఇక కిరిస్టెన్ రాజీనామా విషయానికొస్తే.. బాబర్ ఆజాం వారసుడిగా పాక్ వైట్ బాల్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కాకుండా మరొకరిని అతడు సూచించి ఉంటాడు. అందుకు పీసీబీ చైర్మన్ నో చెప్పి ఉంటాడు. ఇంకేముంది రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా ప్రకటించగానే ఆట మొదలైంది. అనుకున్నట్టే కిరిస్టెన్పై వేటు పడింది. బహుశా కెప్టెన్ ఎంపికలో దక్షిణాఫ్రికా దిగ్గజం తన మాట చెల్లుతుందని భావించి ఉంటాడు.
2 Photos that Defines Cricket in 2 nation 🇵🇰 🆚 🇮🇳
🚨 Gary Kirsten, who signed a two-year contract in April with PCB, has stepped down barely six months into the role
🚨 Gary Kirsten, on the Shoulders of Suresh Raina and Virat Kohli after winning 2011 World Cup#GaryKirsten pic.twitter.com/YPcV8V7WGX
— Richard Kettleborough (@RichKettle07) October 28, 2024
అసలు కిరిస్టెన్‌కు తెలియని విషయం ఏంటంటే.. పాకిస్థాన్‌లో బోర్డు చైర్మన్‌ను రాత్రికి రాత్రే మార్చేసేన రోజులున్నాయి. ఎవరైతే నోరు తెరుస్తారో.. గట్టిగా విమర్శిస్తారో వాళ్లను తప్పిస్తారు. అందుకు తాజా ఉదాహారణ కిరిస్టెన్. అని బసిత్ పీసీబీ తీరును విమర్శించాడు’ అంటూ బసిత్ తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించాడు. ఏప్రిల్‌లో పాక్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కిర్‌స్టెన్ ఆరు నెలలకే రాజీనామా చేశాడు. పాక్ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 సిరీస్ ద్వారా తొలి పరీక్ష ఎదురవ్వనుంది.
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శన అనంతరం పీసీబీ కొత్త కోచ్ వేట మొదలెట్టింది. ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ (Shane Watson), వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సమీ(Darren Sammy)లను కాదని.. టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కిరిస్టెన్‌ను కోచ్‌గా నియమించింది. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే కిరిస్టెన్.. వరల్డ్ కప్ వైఫల్యానికి కారకులను బాహాటంగానే విమర్శించాడు. జట్టులో సమూల మార్పులకు పట్టు పట్టాడు. ఇవేవీ పీసీబీకి నచ్చలే. అందుకు ఫలితమే అతడి రాజీనామా. దాంతో.. పలు జట్లకు కోచ్‌గా విజయవంతమైన కిరిస్టెన్ సేవల్ని పాక్ కోల్పోవాల్సి వచ్చింది.
Gary Kirsten is a world renowned coach. His resignation is disappointing. Foreign coaches won’t be comfortable coming over to Pakistan in future if such cases don’t stop ✋ pic.twitter.com/VRe53WUMBw
— kamil khan (@13kamilkhan) October 28, 2024