IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకాశం వస్తే చాలు రెక్కలు కట్టుకొని భారత్‌లో వాలిపోతున్నారు విదేశీ క్రికెటర్లు. జాతీయ జట్టును కాదని కొందరు.. ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌ను కాదని మరికొందరు ఐపీఎల్ 18వ సీజన్లో ఆడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాస్చ్(Corbin Bosch) చేరిపోయాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) జట్టుతో ఒప్పందం చేసుకున్న అతడు.. ఐపీఎల్ ఆఫర్ రావడంతో సదరు ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పాడు. అయితే.. తమను కాదని ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమైన బాస్చ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చర్యలకు ఉపక్రమించింది. జరిమానాతో పాటు ఏడాది నిషేధం విధించింది.
పీఎస్ఎల్ 2025 ఎడిషన్‌లో పెషావర్ జల్మి(Peshawar Zalmi) జట్టు తరఫున ఆడుతానని బాస్చ్ జనవరిలో ఒప్పందం చేసుకున్నాడు. దాంతో, తమ బౌలింగ్ యూనిట్ బలోపేతం అయిందని జల్మి యాజమాన్యం మురిసిపోయింది. ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కానీ, సీజన్ ఆరంభానికి ముందే బాస్చ్ బాంబ్ పేల్చాడు.
తాను ఈసారి ఆడడం లేదని.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడేందుకు వెళుతున్నానని చెప్పాడు. ఊహించని షాక్ నుంచి తేరుకున్న జల్మి ఫ్రాంచైజీ అతడిపై పీఎస్ఎల్ పాలకమండలి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు బాస్చ్కు జరిమానాతో పాటు ఏడాది కాలం నిషేధం విధించింది పీసీబీ.
🚨 PCB BANS CORBIN BOSCH FROM PSL FOR 1 YEAR 🚨
Corbin Bosch said “I deeply regret my decision to withdraw from the Pakistan Super League and offer my sincere apologies to the people of Pakistan, the fans of Peshawar Zalmi and the wider cricket community”. pic.twitter.com/gMTAB9Mj5W
— Johns. (@CricCrazyJohns) April 10, 2025
తనపై పీఎస్ఎల్ విధించిన ఆంక్షలపై బాస్చ్ స్పందించాడు. ‘పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నందుకు బాధగానే ఉంది. టోర్నీ ఆరంభానికి ముందే జట్టును వీడుతున్నందుకు పెషావర్ జల్మి యాజమాన్యానికి, పాకిస్థాన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. పీఎస్ఎల్ అనేది ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్. నా నిర్ణయంతో మీకు కలిగిన అసంతృప్తిని అర్థం చేసుకోగలను.
🗣️ Corbin Bosch:
“I deeply regret my decision to withdraw from the HBL Pakistan Super League (PSL) and offer my sincere apologies to the people of Pakistan, the fans of Peshawar Zalmi and the wider cricket community.
The HBL PSL is a prestigious tournament and I fully… pic.twitter.com/D2A5PxTpTM
— Cricwick (@Cricwick) April 11, 2025
అందుకే.. నాపై విధించిన జరిమానా, ఏడాది నిషేధాన్ని అంగీకరిస్తున్నాను. మళ్లీ కచ్చింతగా తిరిగొస్తాను. పీఎస్ఎల్లో అదరగొడుతాను’ అని వెల్లడించాడీ సఫారీ స్పీడ్‌స్టర్. 18వ సీజన్‌తో బాస్చ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. గాయపడిన సఫారీ పేసర్ లిజాడ్ విలియమ్స్( Lizaad Williams) స్థానంలో బాస్చ్తో అగ్రిమెంట్ చేసుకుంది ముంబై.