మక్తల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Houses) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakiti Srihari ) అన్నారు. మక్తల్‌లోని తన నివాసంలో మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులతో ( Congress Leaders ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గానికి రూ. 175 కోట్ల వ్యయంతో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరా మహిళ పథకాన్ని పూర్తి పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకే అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
మున్సిపాలిటీలో ఇల్లు లేని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని సూచించాలన్నారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి బెసజాలకు పోకుండా పూరి గుడిసెలు, పెంకుటిల్లలో నివసిస్తున్న వారి వివరాలు తీసుకొని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.