EX MLC JEEVAN REDDY | సారంగాపూర్ : వివిధ ప్రాంతాల నుండి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి పాదయాత్రగా వెళ్తున్న ఆంజనేయ స్వాములు మజ్జిగ, పండ్లు, మినరల్ వాటర్ ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం అందించారు.
ఈ సందర్భంగా ఖర్చుల నిమిత్తం స్వాములకు జీవన్ రెడ్డి రూ. 2వేలు విరాళం అందజేశారు. గ్రామానికి చెందిన స్వాములు ప్రతీ సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా మండల కేంద్రం నుండి కాలినడకన వెల్లె స్వాములకు మజ్జిగ, వాటర్, పండ్లు అందిస్తుందడాన్ని మాజీ ఎమ్మెల్సీ ని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండ్ర రాంచంద్ర రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, సత్యం రెడ్డి, గౌడిశెట్టి రాజన్న, అసాది రాజన్న, కోటి రెడ్డి, బేర మహేష్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అసాది హరీష్, యువజన నాయకులు చెకుట శేఖర్, ఉపేందర్, వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.