IPL 2025 | ఐపీఎల్-2025 సీజన్ ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగే ఫైనల్‌తో ముగియనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇప్పటి వరకు టైటిల్‌ను గెలువని విషయం తెలిసిందే. రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలువబోతున్నది. పంజాబ్, ఆర్సీబీ గ్రూప్ దశలో తొలి రెండుస్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరి.. ఫైనల్లో తలపడబోతున్నాయి. ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు అద్భుత ప్రదర్శన చేసి గ్రూప్ దశలో తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. గ్రూప్ దశను ముగిసే సరికి పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఆర్సీబీ రెండోస్థానంలో నిలిచింది.
Read Also : Womens World Cup | సెప్టెంబర్ 30 నుంచి మహిళల వరల్డ్ కప్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆర్సీబీ-పంజాబ్ జట్లు 2021లో అహ్మదాబాద్‌తో ఓ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచింది. అయితే, క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ ఓడించి ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబయిపై విజయంతో పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరుగున్నది. పంజాబ్-ముంబయి మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ 2.15 గంటలు ఆలస్యంగా మొదలైంది. అదనపు సమయం కేటాయించడంతో పూర్తిస్థాయిలో మ్యాచ్‌ని నిర్వహించారు. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా? అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Read Also : Asia Cup 2025 | చికెన్‌గున్యా ఎఫెక్ట్.. ఎమర్జింగ్ ఆసియా కప్ వాయిదా..!
వాతావరణశాఖ నివేదిక ప్రకారం.. ఫైనల్ రోజున అహ్మదాబాద్‌లో వర్షం కురిసేందుకు అవకాశాలున్నాయి. వర్షం కురవడంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్‌లోనే జరిగింది. ఆ సమయంలోనూ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిఇంచింది. ఆ సీజన్లో ఫైనల్ మ్యాచ్ మే 28న జరగ్గా.. వర్షం కారణంగా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యపడలేదు. టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉండడంతో ఫైనల్‌ను మరుసటి రోజున నిర్వహించారు. రిజర్వ్ డే రోజున సైతం వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. ఈ సీజన్లో ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న మంగళవారం జరుగనున్నది. వర్షం అంతరాయం కలిగిస్తే.. మళ్లీ బుధవారం నిర్వహించనున్నారు. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ సమయం పెంచింది. మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు బీసీసీఐ అదనంగా రెండు గంటల సమయం కేటాయించింది.
Read Also : Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హెన్రిచ్ క్లాసెన్
ఈ మేరకు మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమైతే ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ జరుగుతుంది. ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ సమయం రాత్రి 11.56 గంటలు కాగా.. ఆ సమయానికి కూడా మ్యాచ్ జరుగకపోతే మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే రోజున మ్యాచ్ పూర్తిస్థాయిలో నిర్వహించడం సాధ్యం కాకపోతే రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ అత్యధిక పరుగులు చేసిన జట్టు చాంపియన్‌గా నిలుస్తుంది. ఈ సూపర్ ఓవర్‌కు సైతం అదనంగా 20 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించింది. అంటే సూపర్ ఓవర్ రాత్రి 12.30 గంటలకు సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దవుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ విజేతగా నిలుస్తుంది.