Asia Cup 2025 : మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ (Womens Emerging Teams Asia Cup 2025) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శ్రీలంక వేదికగా జూన్ 6 నుంచి టోర్నీ మొదలవ్వాల్సింది. కానీ, హఠాత్తుగా టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) సోమవారం వెల్లడించింది. అసలు కారణం ఏంటంటే..? శ్రీలంకలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ అధ్యక్షడు షమ్మీ సిల్వా(Shammi Sliva) ఏసీసీ దృష్టి కి తీసుకువచ్చాడు. దాంతో, క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టోర్నీని వాయిదా వేయాలని ఏసీసీని ఆయన అభ్యర్తించారు. సో.. కొన్ని రోజులు నిర్ణయం తీసుకుంది. అయితే.. కొత్త షెడ్యూల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారు? అనేది మాత్రం తెలియడం లేదు. ‘మా దేశంలో ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదు. పైగా చికెన్‌గున్యా కేసులు పెరుగుతున్నాయి.
#BREAKING: The 2025 ACC Women’s Emerging Teams Asia Cup, originally to begin from June 6 in Sri Lanka, has been postponed due to adverse weather and health concerns. The Asian Cricket Council (ACC) added that the new dates for the tournament will be announced in due course of… pic.twitter.com/UaFJr7wDt6
— IANS (@ians_india) June 2, 2025
ఈ పరిస్థితుల్లో మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నిర్వహణ సవాల్‌గా మారనుంది. అందుకే.. కొన్ని రోజులు టోర్నీని వాయిదా వేయాలని ఏసీసీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశాను’ అని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా వెల్లడించాడు. ఆయన లేఖ అందిన తర్వాత క్రికెటర్ల ఆరోగ్యమే తమ తొలి ప్రాధాన్యమంటూ టోర్నీని నిలిపి వేస్తున్నట్టు తెలిపింది.
‘యువ మహిళా క్రికెటర్లు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు ఏసీసీ అవకాశాలు కల్పిస్తుంది. ఆసియాలో మహిళా క్రికెట్ గతిని మార్చడంలో ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఎంతో ఉపకరిస్తుంది. అయితే.. శ్రీలంకలో పరిస్థితుల గురించి తెలిశాక టోర్నీని వాయిదా వేయడమే సరైన నిర్ణయమని భావించాం. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తాం ‘అని ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తెలిపాడు.
మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ను 2023లో తొలిసారి నిర్వహించారు. ఆ టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత ఏ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో బంగ్లాదేశ్ ఏ జట్టుపై 31 పరుగుల తేడాతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది.