డర్బన్: సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen).. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్‌గా అతను ఆడాడు. అయితే ఇటీవల ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్.. అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2024 జనవరిలో అతను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు అతను ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించానని, ఇది తనకు విషాదకర దినమని క్లాసెన తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. ఈ నిర్ణయం తీసుకునేందుకు తనకు చాలా సమయం పట్టిందన్నాడు. తన కుటుంబం గురించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. టీ20 క్రికెట్లో క్లాసెన్ విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీ20 కెరీర్‌ను పొడిగించాలని అతను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో సియాటెల్ ఆర్కాస్ తరపునఆడేందుకు అతను కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ద హండ్రెడ్ టోర్నీలో అతను మాంచెస్టర్ ఒరిజినల్స్ తరపున ఆడనున్నాడు.
Heinrich Klaasen has announced his immediate retirement from international cricket, bringing an end to a distinguished seven-year career with the Proteas Men.
The 33-year-old announced on Monday that he would be stepping away from the white-ball formats, which follows his… pic.twitter.com/RwAPBZVoeO
— Proteas Men (@ProteasMenCSA) June 2, 2025