IPL 2025 : స్పిన్ మాంత్రికుడు యజ్వేంద్ర చాహల్(Yazvendra Chahal) వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యుజీ.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఆడడం లేదు. దాంతో, అతడికి ఏమైంది అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే.. గాయం కారణంగానే ఈ లెగ్ స్పిన్నర్ బెంచ్‌కే పరిమితం అయ్యాడని సోమవారం బీసీసీఐ తెలిపింది.
‘చాహల్ వేలికి గాయమైంది. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు యుజీ అందుబాటులో ఉంటాడు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాహల్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన పంజాబీ హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిరుడు 12 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడీ మణికట్టు మాంత్రికుడు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
𝑩𝒊𝒈 𝒃𝒍𝒐𝒘 𝒇𝒐𝒓 𝑷𝑩𝑲𝑺! 🤕
Yuzvendra Chahal is suffering from a wrist injury and is likely to miss their crucial match against Mumbai Indians! ❌👀#IPL2025 #PBKSvMI #YuzvendraChahal #Sportskeeda pic.twitter.com/l4PhA5xSaK
— Sportskeeda (@Sportskeeda) May 25, 2025
టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన చాహల్‌ను మెగా వేలంలో రూ.18 కోట్లు వెచ్చించి మరీ కొన్నది పంజాబ్. కానీ, ఆరంభంలో నిరాశపరిచిన అతడు.. ఆర్సీబీ, కోల్‌కతాపై తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. 11 మ్యాచుల్లో 14 వికెట్లు తీసిన ఈ సీనియర్ స్పిన్నర్.. పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడీ లెగ్గీ. హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)ల నేతృత్వంలో రాటుదేలిన పంజాబ్.. 2008 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్ చేరింది. ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ నాకౌట్ పోరుకు దూసుకెళ్లిన అయ్యర్ సేన.. తొలి టైటిల్ అందుకోవాలనే కసితో ఉంది. సోమవారం ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే.. పంజాబ్ 19 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది.