IPL 2025 : జైపూర్‌లో ధాటిగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రియాన్ రికెల్టన్(27) ఔటయ్యాడు. యాన్సెన్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయి అయ్యర్ చేతికి చిక్కాడు. దాంతో, 45 వద్ద ముంబై మొదటి వికెట్ పడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(5 నాటౌట్) ఎదుర్కొన్న మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ(17 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 52 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు చక్కని ఆరంభం ఇచ్చారు. పంజాబ్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో తొలి రెండు ఓవర్లు 17 రన్స్ వచ్చాయంతే. మూడో ఓవర్ తర్వాత గేర్ మార్చిన రికెల్టన్ (27).. జేమీసన్‌ను ఉతికేస్తూ రెండు పోర్లతో ఊపు తెచ్చాడు. నాలుగో ఓవర్ తర్వాత స్పీడ్ పెంచిన రోహిత్ శర్మ(17 నాటౌట్) కూడా హర్‌ప్రీత్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టాడు. అంతే.. ముంబై స్కోర్ 45కు చేరింది.
Marco Jansen opens the account for #PBKS 👊
Ryan Rickelton walks back as #MI end the powerplay at 52/1!
Updates ▶ https://t.co/Dsw52HOtga#TATAIPL | #PBKSvMI | @PunjabKingsIPL pic.twitter.com/kM1e4XUMxS
— IndianPremierLeague (@IPL) May 26, 2025