Pat Cummins : నవంబర్‌లో, వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా జట్టు కీలకమైన టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాపై, శ్రీలంకపై ఆసీస్ కచ్చితంగా గెలవాలి. అయితే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins ) వీటిలో ఒక సిరీస్‌కు దూరం కానున్నాడు. రెండోసారి తండ్రి కాబోతున్న కమిన్స్ జట్టుకు దూరం కానున్నాడని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు.
ప్రస్తుతం కమిన్స్ భార్య బెకీ కమిన్స్ (Becky Cummins) గర్భవతి. ఆమె త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకని కమిన్స్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ స్వదేశంలో ఉండిపోవాలని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని అతడు కోచ్‌కు కూడా తెలియజేశాడట. దాంతో, వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనలో కమిన్స్ లేకుండానే ఆసీస్ రెండు టెస్టులు ఆడనుంది.
కెప్టెన్ గైర్హాజరీ వార్తలపై కోచ్ మెక్‌డొనాల్డ్ ఏం అన్నాడంటే.. ఇప్పటికే మిచెల్ మార్ష్, ఓపెనర్ ట్రావిస్ హెడ్లు పితృత్వ సెలవులు తీసుకున్నారు. త్వరలోనే కమిన్స్ కూడా రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అయితే.. సమయం మాత్రం కచ్చితంగా తెలియదు. ఒకవేళ అతడు శ్రీలంకతో టెస్టు సిరీస్ కంటే భార్యతో పాటు స్వదేశంలోనే ఉండేందుకు సిద్ధపడితే ఏమీ చేయలేం అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
Pat Cummins could miss Australia’s tour of Sri Lanka at the start of next year for the birth of his second child
👉 https://t.co/7xrNaxmdao pic.twitter.com/d9GE9hsaFU
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన టెస్ట్ సిరీస్ జరుగనుంది. వచ్చే ఏడాది లంక పర్యటనలో ఆసీస్ రెండు టెస్టులతో పాట ఒక వన్డే ఆడనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, శ్రీలంకలకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. అందుకని శ్రీలంక బోర్డు శుక్రవారం సిరీస్ షెడ్యూల్ విడుదల చేసింది.
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ధనంజయ డిసిల్వా నేతృత్వంలోని లంక ఢీ కొట్టనుంది. ఇరుజట్ల మధ్య గాలే వేదిగా జనవరి 29వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం అదే మైదానంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆసీస్, లంక జట్లు రెండో టెస్టులో ఢీకొట్టనున్నాయి.