క్యాన్బెరా: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్(Australian PM Albanese) ఇవాళ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా ఆయన ఆలయాన్ని విజిట్ చేశారు. బందీ చోర్ దివస్ సందర్భంగా కూడా ఆయన తలకు పాగా కట్టుకుని గురుద్వారా వెళ్లారు. ఆరెంజ్ రంగు టర్బన్ ధరించిన ఆయన ఫోటోలను షేర్ చేశారు. సిడ్నీ శివారు ప్రాంతమైన గ్లెన్‌వుడ్‌లో ఉన్న గురుద్వారాకు ప్రధాని ఆల్బనీస్ వెళ్లారు. అక్కడ ఆయన కొత్త కిచెన్‌ను ప్రారంభించారు. గురుద్వారా సభ్యులతో ఆల్బనీస్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
Happy Bandi Chhor Divas!
Wonderful to celebrate at Gurdwara Sahib Glenwood today and open the newly expanded kitchen, serving thousands of people every week. pic.twitter.com/FVVi8HVKmg
— Anthony Albanese (@AlboMP) November 1, 2024
భక్తులతో ఆయన సెల్ఫీలు దిగారు. సిడ్నీలోనే ఉన్న మురుగన్ ఆలయాన్ని కూడా ఆయన విజిట్ చేశారు. ఆస్ట్రేలియాలోని తమిళ కమ్యూనిటీతో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మురుగన్ ఆలయానికి ప్రతి రోజు ఎంతో మంది విజిట్ చేస్తుంటారని, దక్షిణ ఆసియా హిందూ కమ్యూనిటీకి ఇది ముఖ్య ఆలయమైందని తన ఎక్స్ అకౌంట్లో ప్రధాని అల్బనీస్ పోస్టు చేశారు.
Deepavali celebrates the victory of light over darkness.
Fantastic to join with the Tamil Australian community at the Sydney Murugan Temple today.
The temple draws in people from all walks of life every day, and has become a sanctuary for Western Sydney’s South Asian Hindu… pic.twitter.com/sY1eoRRngs
— Anthony Albanese (@AlboMP) November 1, 2024