Paris Olympics : భారత యువ బాక్సర్ అమిత్ పంగల్(Amit Panghal) విశ్వ వేదికపై తన పంచ్ వవర్ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్‌ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు ఖాయం చేసుకున్నాడు. తద్వారా భారత్ నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన ఐదో బాక్సర్‌గా పంగల్ రికార్డు నెలకొల్పాడు.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ క్వార్టర్స్‌లో అమిత్ రెచ్చిపోయాడు. చైనాకు చెందిన లూ చౌంగ్పై పంచ్‌ల వర్షం కురిపించి 5-0తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లాడు. దాంతో, నిశాత్ దేవ్ తర్వాత ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్న రెండో పురుష బాక్సర్‌గా అమిత్ నిలిచాడు.
Many congratulations to Amit Panghal on securing a Quota for @paris2024 in the 51kgs Men’s Boxing event 🇮🇳
Our 5th Boxing quota for #Paris2024, and 1st of a possible 3 today. 👏🏽👏🏽#Cheer4India | #WeAreTeamIndia | #PunchMeinHaiDum@Media_SAI @ianuragthakur @NisithPramanik pic.twitter.com/3qASq08h2p— Team India (@WeAreTeamIndia) June 2, 2024
రెండు రోజుల క్రితమే యువకెరటం నిషాంత్ దేవ్(Nishant Dev) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు సాధించాడు. 71 కిలోల విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్(World Boxing Qualifiers)లో నిషాంత్.. మొల్డోవా బాక్సర్ వెసిలే సెబొటరీ (Vesile Cebotari)కి ముచ్చెమటలు పట్టించాడు. మ్యాచ్ ఆసాంతం పంచ్‌ల వర్షం కురిపించిన నిశాంత్ 5-0తో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. తద్వారా ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసకున్నాడు.
Ending the day with a motivation from Nishant 🥊🗣️
🎥 : @OlympicKhel#PunchMeinHaiDum#2ndOlympicBoxingQualifiers#Boxing pic.twitter.com/hLjtmfbmx3
— Boxing Federation (@BFI_official) May 31, 2024
ప్రస్తుతానికి పంగల్‌తో కలిపి ఐదుగురు బాక్సర్లు ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించారు. ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్(50 కిలోలు), ఈశాన్య రాష్ట్రానికి చెందిన లొవ్లినా బొర్గొహెన్(75 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు), నిశాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగల్(51 కేజీ) లు విశ్వ క్రీడల్లో పతకంపై గురి పెట్టారు.