Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి గర్భిణి మృతి
Pregnant woman died | వైద్యం వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది.
నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) దారుణం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన ఏడు నెలల ఓ గర్భిణికి సూది మందు ఇచ్చారు. ఆ మందు వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడూర్ మండల కేంద్రానికి చెందిన మహేందర్, పద్మ (36) వీరికి ఒక కూతురు ఉంది.
అయితే పద్మ రెండో సారి గర్భం దాల్చి 7 నెలలు కావడంతో నొప్పులు వస్తున్నాయి జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో ఆదివారం ఉదయం వెళ్లారు. దవాఖానకలో డాక్టర్ లేకపోవడంతో అందులో పని చేసే నర్సులు స్కానింగ్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు. కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో జిల్లా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలంటూ బాధితులకు నర్సులు చెప్పారు.
అంతలోనే గర్భిణి మృతి చెందింది. దీంతో హాస్పిటల్ వర్గాల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

