KCR : ఎగ్జిట్ పోల్స్ ఒక గ్యాంబ్లింగ్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇదంతా ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యిందని వ్యాఖ్యానించారు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
‘రాజకీయ ఫలితాలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూనే ఉండాలి. ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్కు 11 స్థానాలు వస్తాయని ఓ సంస్థ చెబితే.. ఒక సీటే వస్తుందని మరో సంస్థ చెప్పింది. చెప్పారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు. మూడు సీట్లు వచ్చినంత కుంగిపోయేది లేదు. రాజకీయంగా జయాపజయాలు మనకు లెక్కకాదు’ అని వ్యాఖ్యానించారు.