Headingley Test : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(73 నాటౌట్) రెచ్చిపోతున్నాడు. హెడింగ్లే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాదేశాడు. లంచ్ తర్వాత దూకుడు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో బౌండరీ, డబుల్స్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్(86నాటౌట్) సెంచరీకి చేరువయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ నాలుగో వికెట్‌కు 118 రన్స్ జోడించిందీ ద్వయం. దాంతో, భారత ఆధిక్యం రెండొందలు దాటింది.
నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లను దీటుగా ఎదుర్కొన్న కేఎల్ రాహుల్(86 నాటౌట్) అర్ధ శతకంతో కదం తొక్కగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(73 నాటౌట్) తన సహజ శైలికి విరుద్దంగా సంయమనంతో ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు విలువైన 61 రన్స్ జోడించగా.. లంచ్ టైమ్‌కు 153 రన్స్ కొట్టిది టీమిండియా.
Hundred in the First Innings 🙌
Fifty up (and going strong) in the Second Innings 💪
Rishabh Pant has been putting on a show at Headingley! 👌
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @RishabhPant17 pic.twitter.com/hkuFzfxEwJ
— BCCI (@BCCI) June 23, 2025
భోజన విరామం తర్వాత జోష్ టంగ్ వేసిన తొలి ఓవర్లోనే పంత్ వరుసగార రెండు ఫోర్లు బాదాడు. అనంతరం అతడి బౌలింగ్‌లోనే ఫోర్ కొట్టి.. డబుల్స్ తీసి ఫిఫ్టీ సాధించాడు. అనంతరం బషీర్‌కు చుక్కలు చూపిస్తూ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదాడీ చిచ్చరపిడుగు.